You are here
Home > తాజా వార్త‌లు > అమర్‌నాథ్ యాత్రలో ‘ఉగ్ర’ కలకలం..? కరీంనగర్ వాసి మృతి.

అమర్‌నాథ్ యాత్రలో ‘ఉగ్ర’ కలకలం..? కరీంనగర్ వాసి మృతి.

అమర్‌నాథ్ యాత్రలో ‘ఉగ్ర’ కలకలం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ వాసులు బాంబు దాడిలో గాయపడ్డట్టుగా తెలుస్తోంది. దీనీపై కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి దృవికరణ చేయలేదు. సిలిండర్ పేలిందని చెపుతున్నప్పటికి ఉగ్రదాడి జరిగిందనే తెలుస్తోంది. ఈ బాంబు దాడిపై కేంద్రం సమాచారాన్ని దాటవేస్తోంది.

అమర్ నాథ్  యాత్రలో ఉన్న తెలుగువారి బస్సులో పేలింది సిలిండర్‌ పేలిందని మొదట వార్తలు వచ్చాయి కానీ పేలింది సిలిండర్ కాదని తెలయస్తుందో.. అయితే వాళ్లమీద బాంబుదాడి జరిగిందా..? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భాదితుల సమాచారం కూడా ఉగ్ర దాడి జరిగిందనే చెపుతోంది. కరీంనగర్‌, నిజామాబాద్‌, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి 47 మంది యాత్రను ముగించుకుని తిరుగు పయనమయ్యారు.

జమ్ముకశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌ నగరానికి దగ్గరలోని గాజికొండు వద్ద భోజనాల కోసం వాహనం ఆపారు. తిరిగి బయలుదేరుతున్నప్పుడు జరిగినట్లు సమాచారం. దీంతో ఈ ప్రమాదంపై గ్యాస్ సిలిండర్ పేలిందని చెప్పాలని ప్రయాణికులకు ఆర్మీ అధికారులు హితబోధ చేశారని తెలుస్తోంది.

భోజనాలు చేసి, అంతా బస్సులో కూర్చున్న తర్వాత ఒక్కసారిగా పెద్దశబ్దంతో పేలుడు సంభవించిందని, ఏం జరిగిందో తెలిసేలోపే కరీంనగర్‌ జిల్లావాసి శంకర్‌ పంతులు ప్రాణాలు కోల్పోయారని, 12 మందికి తీవ్ర గాయాలయ్యాయని గాయపడిన వ్యక్తి చెప్పారు. వీరిని శ్రీనగర్‌ ఆర్మీ ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు.

కాళ్లు, చేతులకు దెబ్బలు తగిలినవారు కట్లు కట్టించుకుని తిరిగి సీఆర్పీఎఫ్‌ క్యాంప్ వద్దకు వచ్చారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆర్మీ ఉన్నతాధికారులు, శ్రీనగర్‌ కలెక్టర్‌ అక్కడి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అందరితో మాట్లాడి విషయం బయటకు చెప్పొద్దని, సిలెండర్‌ పేలిందని చెప్పమన్నట్లు తెలుస్తోంది.

అమర్ నాథ్ యాత్రపై వెంటనే స్పందించిన తెలంగాణ సర్కార్ చనిపోయిన వ్యక్తి పేరు మురళి అని అధికారులు చెప్పగా, బాధితులు మాత్రం శంకర్‌ పంతులు అంటున్నారు. ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ వెంటనే స్పందించింది. వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేలా సహాయ చర్యలు చేపట్టాలని ఢిల్లీ టీఎస్‌ భవన్‌ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అక్కడి పరిస్థితిని తెలుసుకుని కామారెడ్డి కలెక్టర్‌కు, విప్‌ గంపా గోవర్ధన్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రులను సురక్షితంగా విమానంలో ఢిల్లీకి చేర్చాలని తెలంగాణ సీఎస్‌ ఎస్పీ సింగ్‌ కోరారు. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎస్‌, జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. కాజిగూడ సీఆర్పీఎఫ్‌ బేస్‌క్యాంప్‌లో వైద్యం పొందుతున్న వీరిని ఢిల్లీకి తరలించాలని కోరారు. జమ్ముకశ్మీర్‌ అధికారులతో సంప్రదింపులు జరపాలని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ను ఆదేశించారు. మృతదేహాన్ని కూడా తరలించాలని కోరారు.

క్షతగాత్రులకు శ్రీనగర్ ఆసుపత్రుల్లో చికిత్స
అమర్‌నాథ్‌ ఘటనలో కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల యాత్రికులు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కామారెడ్డి వాసులు జయంతి, ఎస్‌ లక్ష్మి, బెజుగం పద్మలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంత్‌నాగ్‌ ఆస్పత్రిలో నిజామాబాద్‌కు చెందిన అశోక్‌, కామారెడ్డి జిల్లా వాసులు జంగం భైరయ్య, జంగం పుష్ప, బెజుగం మురళీధర్‌ కూడా చికిత్స పొందుతున్నారు. శ్రీనగర్‌లోని కుచ్‌కుండి ఆసుపత్రిలో కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన జంగం ప్రభాకర్‌స్వామి, ఆయన భార్య జయంతి, పుష్ప చికిత్స పొందుతున్నారు. తీవ్రగాయాలైన ముగ్గురిని శ్రీనగర్‌లో కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

జమ్ము కశ్మీర్ అధికారులతో పోచారం సంప్రదింపులు
బాధితుల కుటుంబసభ్యులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశారు. తమవారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించి స్వస్థలానికి తీసుకువచ్చేలా అక్కడివారితో మాట్లాడాలని కోరారు. దీంతో మంత్రి పోచారం, కలెక్టర్‌, జమ్ము కాశ్మీర్‌ ప్రభుత్వంతో, అధికార వర్గాలతో ఫోన్‌లో మాట్లాడి ఉమ్మడి జిల్లా వాసుల వివరాలను అడిగి తెలుసుకుని, ఆ వివరాలు చెప్పారు. అమర్‌నాథ్‌ యాత్రలో జరిగిన ప్రమాదంలో జిల్లాకు చెందినవారు క్షేమంగానే ఉన్నారని.. వారిని శనివారం లోపు కామారెడ్డి, నిజామాబాద్‌కు తీసుకొచ్చేలా కృషి చేస్తామని కుటుంబ సభ్యులకు మంత్రి, కలెక్టర్‌ సత్యనారాయణ హామీ ఇచ్చారు.

Related Posts
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
తెలంగాణ పోలీసులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల వర్షం కురిపించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఎస్సై స్థాయినుండి డీజీ స్థాయి వరకూ అధికారులతో కేసీఆర్‌ సమావేశమయ్యారు ... ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ మహిళా పోలీసుల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దీనికవసరమైన సొమ్మును ...
READ MORE
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
అతిగా ఆవేశ పడే ఆడదానికి, అతిగా ఆశ పడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారంటూ కామెంట్ చేసాడు హైపర్ ఆది అనే ఓ టీవీ ఆర్టిస్ట్. ఈ మాట అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో జస్ట్ కామెడీ మాత్రమే ...
READ MORE
11ఏండ్ల స్కూల్ చిన్నారికి బాయ్స్ టాయిలేట్ లో శిక్ష.. టీచర్ నిర్వాకం.
రాను రాను సమాజంలో విలువలతో కూడిన ఆలోచనలకు పూర్తిగ మంగళం పాడుతున్నారు కొందరు ఉపాద్యాయులు. ఈ మద్య కాలంలోనే కొందరు ఉపాద్యాయులు పిల్లల పట్ల అసభ్యంగ ప్రవర్తించిన ఘటనలు వేదించిన ఘటనలు దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తించాయి. ఇవన్నీ మరవకముందే తాజాగా హైద్రాబాద్ ...
READ MORE
యాజమాన్యాల పైసల కక్కుర్తి అధికారుల నిర్లక్ష్యం పరీక్షకు దూరమైన విధ్యార్థులు.
నిన్న మొదలైన పదవ తరగతి పరీక్షల్లో కొందరు విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని అర్థాంతరంగ కోల్పోయారు. ఇప్పుడు వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగ మారింది. రోజు రోజుకు విద్యారంగాన్ని దిగజార్చుతున్నారు కొందరు దుర్మార్గులు. పైసలకు కక్కుర్తి పడి పవిత్రమైన విద్యా రంగాన్ని వ్యాపారీకరణ ...
READ MORE
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
దేశ చరిత్రలో లౌకికత్వానికి మాయని మచ్చగా కర్ణాటక లో జరిగిన అమానుష ఘటన మిగిలిపోనుంది. దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి మత స్వేచ్ఛ కల్పించింది భారత రాజ్యాంగం. ఈ స్వేఛ్చ ప్రకారం ఎవరైనా సరే ఏ మతమైనా స్వీకరించ వచ్చు వారి ...
READ MORE
గౌరీ లంకేష్ ఘటన మరువక ముందే మరో ఘటన.. బీహార్‌లో జర్నలిస్ట్‌పై కాల్పులు.
ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య ఉదంతం మరవక ముందే బిహార్‌లో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. అరవల్‌లో గురువారం జర్నలిస్ట్‌ పంకజ్‌ మిశ్రాపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ పంజక్‌ మిశ్రా పరిస్థితి విషమంగా ఉన్నట్లు ...
READ MORE
తెలంగాణ లో తొందర్లోనే కనుమరుగు కాబోతున్న కాంగ్రెస్ పార్టీ.!!
తెలంగాణ ఇచ్చిన పార్టీ గ భారీ స్థాయి లో ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినా జనాలు కాంగ్రెస్ పార్టీ ని ఏ కోశానా నమ్మినట్టు కనిపించలేదు. కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ కూటమికి ఎక్కువ స్థానాలు ఇచ్చినా ఫలితాల తర్వాత ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో పాగా వేస్తోన్న కాషాయదళం.!!
అస్సాం లో ఎన్ఆర్సీ నివేదిక ప్రకారం 40 లక్షల అక్రమ చొరబాటుదార్లకు భారత పౌరసత్వం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది భారత ప్రభుత్వం. దీంతో వలసదార్లకు మద్దతుపలుకుతూ దేశ వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
మల్కాజిగిరి పై పట్టు బిగిస్తున్న MLC రాంచందర్ రావు..!!
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో దాదాపు 32లక్షల ఓటర్లతో దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ గా రికార్డుకెక్కిన నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంట్. మల్కాజిగిరి అసెంబ్లీ తో పాటు కంటోన్మెంట్, మేడ్చల్, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్లో ...
READ MORE
అసలిది భారతదేశమేనా.? యావత్ హిందూ సమాజాన్ని చెప్పుతో కొట్టిన ఘటన.!
ఈ దుర్ఘటన నిజంగా పాకిస్తాన్ లో జరిగితే దురదృష్టం అనుకోవచ్చేమో.. కానీ హిందుస్తాన్ లోనే జరిగింది అందుకే సిగ్గుతో తలదించుకోవాలి మరి. ఎన్ని రోజులనుండి పన్నిన పన్నాగమో కాని మొత్తానికి చేసేసారు. బంగ్లాదేశ్ లో హిందూ జాతిని అల్లకల్లోలం చేస్తున్నారంటే.. అది నేడు ...
READ MORE
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
పొట్ట కూటికోసం పట్టణానికి వచ్చింది.. ఏదోలా ఓ చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంది. బ్రతుకు దెరువుకి ఓ దిక్కు దొరికింది అని అనుకుంటడగానే హఠాత్తుగా సంబవించిన ప్రమాదం ఆ యువతి జీవితాన్ని అందకారం చేసింది. ఎన్నో కలలు కన్న ఆ యువతి ఏకంగా ...
READ MORE
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ సమాజం ఆగ్రహానికి గురైన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించారు పరిపూర్ణానంద స్వామీజి. ఓ టీవీ ఛానల్ లో ఫోన్ లో మాట్లాడుతూ.. శ్రీరాముడిని కత్తి మహేష్ దూషించిన సంధర్భంగ ...
READ MORE
PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!
రాజకీయ వ్యూహకర్త గ పలువురు ముఖ్యమంత్రులకు రాజకీయ పార్టీలకు వ్యూహాలను అందించిన ప్రశాంత్ కిషోర్ ను JDU అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.ప్రశాంత్ కిషోర్ పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్త గ ఉంటూనే JDU ...
READ MORE
కాంగ్రెస్ 2019 బాహుబలి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో కీలక బాద్యతలు అప్పగింత.?
ప్రత్యేక తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో టీడీపీ చావు దెబ్బలు తిని కొన ఊపిరితో ఉంది, ఇక ఆ ఈపిరి కూడా లేకుండా చేసేలా ఉంది రేవంత్ రెడ్డి క్లైమాక్స్ ఎపిసోడ్. ఇప్పటికే టీటీడీపీ నేతలు తలోదారి చూసుకున్నరు అందులో దాదాపు అందరూ ...
READ MORE
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ అంబేడ్కర్.!!
ఉత్తర ప్రదేశ్ లో రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా. బి. ఆర్ అంబెడ్కర్ పై ఆసక్తికర జీవో విడుదల జరిగింది. అంబెడ్కర్ ని అంతా డా. బీ.ఆర్ అంబేడ్కర్ అంటూ అనడం అలావాటుగ మారిన పరిస్థితిలో ఉత్తర ప్రదేశ్ ...
READ MORE
ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ విద్యార్థులు నమ్ముతారా..?
తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం తప్ప ప్రజలు నమ్మిందే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీని నమ్మే వారు లేక అధికారానికి దూరం అయింది. తాజాగా  మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహించిన సభతో కాంగ్రెస్ ...
READ MORE
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే స్పెష‌ల్.
నిదుర.. అత‌నికి నిత్యం శత్రువే ర‌మ్మ‌న్న రాదు. తిండి అది కూడా బ‌ద్ద శ‌త్రువే,  తిందామ‌న్న స‌మ‌యం దొర‌కదు. వేడి వేడి ఛాయ‌తో దోస్తి చేయ‌డం త‌ప్ప మ‌రో దారి లేని నిక‌ర్సైన రాత‌గాడు. రచ్చ గెలిచి ఇంట గెల‌వ‌లేక పిల్ల‌ల ...
READ MORE
స్వామి వివేకనంద ప్రసంగం మా రాష్ట్రంలో ప్రసారానికి ఒప్పుకోం.!!
స్వామి వివేకనంద అంటే అందరికీ గుర్తొచ్చేది చికాగో సర్వమత సభలు.. అక్కడ జరిగిన మహా సభల్లో స్వామీజి భారతదేశం గొప్పతనాన్ని వివరించిన ప్రసంగానికి యావత్ ప్రపంచం దేశాలు దాసోహం అయ్యాయి. భారతదేశం అంటే ఇంతగొప్పదా అంటూ నోరెల్లబెట్టిన సంధర్భం భారత చరిత్రలో ...
READ MORE
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
ముఖ్యమంత్రి కేసిఆర్ ఉదయం లేస్తే మహిళా సాదికారత గురించి మాట్లాడుతున్నారు.. "షీ" టీం ల నిర్వాహన పై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. పోలీసులు కూడా "షీ" టీం ల గురించి ప్రత్యేక శ్రద్ద పెడుతున్నామని చెబుతున్నారు. కానీ తెలంగాణ లో సాక్షాత్తూ అధికార పార్టీ ...
READ MORE
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు.. ABVP ఫైర్.!!
సరిగ్గా కూర్చోవడం కూడా రాని పిల్లలకు పెన్ను ఎలా పట్టుకోవాలో కూడా తెలియని పిల్లలకు అంటే నర్సరీ LKG పిల్లలపై కూడా లక్షల ఫీజులు ఎలా వసూలు చేయాలో కార్పొరేట్ విద్యా సంస్థలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే ఆశ్చర్యం లేదు. ...
READ MORE
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
సిర్పూర్ కాగజ్ నగర్ మహిళా పోలీస్ అధికారి అటవీ రేంజ్ ఆఫిసర్ పై దాడి కి పాల్పడిన జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు క్రిష్ణ ను వెనకేసుకొచ్చారు కోనేరు క్రిష్ణ అన్న తెరాస ఎంఎల్ఏ కోనేరు కోనప్ప. తన తమ్ముడు అధికారులపై ...
READ MORE
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "లక్ష్మిస్ ఎన్టిఆర్" చిత్రం విడుదల ఆపాలని సినిమా థియేటర్లనే కాదు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో యూ ట్యూబ్ లో ట్విట్టర్ లో ఎలాంటి ఫ్లాట్ ఫాం మీదా విడుదల ...
READ MORE
వర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్.!!
అవును మీరు విన్నది నిజమే.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు తో కరచాలనం చేసాడు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఆయన జీవించిన ఉన్న సమయంలో దిగిన ఒక ఫోటోను వర్మ తన సోషల్ మీడియా ...
READ MORE
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా తిరుగుతా అంటూ.. బెంగాల్ కేరళ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు ...
READ MORE
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
11ఏండ్ల స్కూల్ చిన్నారికి బాయ్స్ టాయిలేట్ లో శిక్ష.. టీచర్
యాజమాన్యాల పైసల కక్కుర్తి అధికారుల నిర్లక్ష్యం పరీక్షకు దూరమైన విధ్యార్థులు.
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
గౌరీ లంకేష్ ఘటన మరువక ముందే మరో ఘటన.. బీహార్‌లో
తెలంగాణ లో తొందర్లోనే కనుమరుగు కాబోతున్న కాంగ్రెస్ పార్టీ.!!
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో
మల్కాజిగిరి పై పట్టు బిగిస్తున్న MLC రాంచందర్ రావు..!!
అసలిది భారతదేశమేనా.? యావత్ హిందూ సమాజాన్ని చెప్పుతో కొట్టిన ఘటన.!
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!
కాంగ్రెస్ 2019 బాహుబలి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో కీలక బాద్యతలు
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ
ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే
స్వామి వివేకనంద ప్రసంగం మా రాష్ట్రంలో ప్రసారానికి ఒప్పుకోం.!!
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
వర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్.!!
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
Facebook Comments
Top
error: Content is protected !!