
దట్టంగా కప్పుకున్న పొగ మంచుతో ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ముందు ఏ వాహనం ఉందో తెలుసుకునే వీలు లేకుండా పొగ మంచు దట్టంగా కమ్ముకోవడం పక్కన ఉన్న మనిషి కూడా కనిపించకపోవడంతో పలువురు ప్రమాదానికి గురయ్యారు. వరుసగా వాహనాలు ఢీ కొనడంతో పదుల సంఖ్యలో వాహనాలు ద్వంసమయ్యాయి 12 మందికి తీవ్ర గాయలయ్యాయి. ఒకటి వెన మరొకటి ఇలా దాదాపు 18 వాహనాలు ఢీకొన్నాయి. దగ్గరకి వచ్చే వరకు వెహికల్ కనిపించకపోవటంతో ముందున్న వాహనాల్లో నుండి హుటాహుటిన దిగే సమయంలో వెనక వాహనాలు వేగంగా ఢీకొట్టడంతో 12 మంది గాయలయ్యాయి.
పొగ మంచు కారణంగా వెనక వచ్చే వాహనాలను అలర్ట్ చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. మనిషి సైతం కనిపించకపోవటంతో ఇబ్బంది పడ్డారు. దీంతో కొందరు అరుస్తూ.. కేకలు వేస్తూ అలర్ట్ చేశారు. మరికొందరు లైట్లు వేసి వాహనాలను ఆపే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.