You are here
Home > అంతరంగం > శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి..

శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి..

జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే.. భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలంటే, ముస్లింల కోసం పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని మహ్మద్ అలీ జిన్నా వత్తిడి తెచ్చాడు.. ఆనాటి వృద్ధ కాంగ్రెస్ నేతలు తాము జీవితంలో పదవులు అనుభవించలేమనే ఆందోళనతో దేశ విభజనకు తలొగ్గారు.. కొత్తగా ఏర్పాడే పాకిస్తాన్లో బెంగాల్, పంజాబ్ ప్రాంతాలను పూర్తిగా కలిపేయాలని నిర్ణయించారు.. ఆ సమయంలో గట్టిగా వ్యతిరేకించి అడ్డు పడిందో గళం.. ఈ రెండు రాష్ట్రాల్లో హిందూ, సిక్కు అధిక్యత గల ప్రాంతాలను విభజించి భారత దేశంలోనే ఉంచాలని పట్టుబట్టారా నాయకుడు.. ఆయనే డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ.. స్వతంత్ర భారత దేశంలో జాతీయవాద రాజకీయాలకు నాంది పలికిన మహానేత..

శ్యాంప్రసాద్ ముఖర్జీ.. 1901 జులై 6 కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి అసుతోష్ ముఖర్జీ ప్రముఖ న్యాయవాది, కలకత్తా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ గా పని చేశారు.. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎంఏ, న్యాయవాద విద్య అభ్యసించారు. 1934లో 33 ఏళ్ల చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాధ్యతలు చేపట్టడం విశేషం. శాసనసభకు ఎన్నికైన శ్యాంప్రసాద్ ముఖర్జీ 1941లో బెంగాల్ ప్రావిన్స్ తొలి ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత హిందూ మహాసభలో ప్రవేశించి ఆ పార్టీకి అధ్యక్షులు అయ్యారు ముఖర్జీ..

దేశ విభజన సమయంలో బెంగాల్, పంజాబ్ పూర్తిగా పాకిస్తాన్ కు వెళ్లకుండా అడ్డుపడ్డారు శ్యాంప్రసాద్ ముఖర్జీ.. జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని స్వతంత్ర భారత జాతీయ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా చేరారు. అయితే నెహ్రూ విధానాలను వ్యతిరేకించి ప్రభుత్వం నుండి బయటకు వచ్చేశారు.
దేశంలో జాతీయ వాదుల కోసం 1951లో భారతీయ జనసంఘ్ పార్టీని ప్రారంభించారు (ఈ పార్టీ కాలక్రమంలో భారతీయ జనతా పార్టీగా మారింది).

1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో జనసంఘ్ 3 స్థానాల్లో గెలుపొందగా, ఒక స్థానంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ విజయం సాధించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ నెహ్రూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ముఖర్జీ. ఆర్టికల్ 370 రద్దు కోసం పట్టుబట్టారు. ‘ఏక్ దేశ్ మే విధాన్, ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే తో నిషాన్.. నహీ చలేగా, నహీ చలేగా..’ ( ఒక దేశంలో రెండు విధానాలు, ఇద్దరు ప్రధానులు, రెండు పతాకాలు వద్దే వద్దు) అంటూ నినదించారు..
జమ్మూ కాశ్మీర్ భారత దేశంలో సంపూర్ణ భాగం.. ఆ రాష్ట్రంలో భారతీయులకు నివసించే హక్కును ఎలా నిరాకరిస్తారని ప్రశ్నిస్తూ సత్యాగ్రహాన్ని తలపెట్టారు శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఇందులో భాగంగా 1953 మే 11న ఆ రాష్ట్రంలోని ప్రవేశించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. మే 23న నిర్భందంలోనే ప్రాణాలు కోల్పోయారు ముఖర్జీ.. ఆయన మరణం మిస్టరీగా మిగిలిపోయింది. దీనిపై దర్యాప్తు జరిపించేందుకు ప్రధాని నెహ్రూ నిరాకరించారు.

భారత దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలంటూ బలిదానం అయ్యారు శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి.. జూన్ 6న ముఖర్జీ జన్మదినం సందర్భంగా ఆ మహానాయకున్ని తలచుకుందాం.. దేశ సమగ్రతను కాపాడుకుందాం. 

Related Posts
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
2014 లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రం తో పాటు తెలుగు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది.ఏపీలో మొత్తం తుడుచుపెట్టుకుని పోగా.. తెలంగాణ లో కాస్త బలంగానే ఉంది. ఈ క్రమంలోనే 2018 ముందస్తు ఎన్నికల్లో అధికారం కోసం తీవ్రంగ ప్రయత్నించి చివరకు ...
READ MORE
కాలా కి లైన్ క్లియర్.. 7న దేశ వ్యాప్తంగా విడుదల.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా "కాలా" 7 న విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించినా.. కర్నాటక లో మాత్రం కొన్ని ప్రజా సంఘాల వారు రజినీకాంత్ కాలా చిత్రాన్ని అడ్డుకుంటామంటూ గొడవ చేయడంతో కర్నాటక లో విడుదల డౌటే ...
READ MORE
????????????????????????????????????
మట్టిని పిష్కి సమస్త సంపదను సృష్టించిన చేతులు తమ ప్రతిభను చాటుతున్నయి. మనిషిని మహాభ్యు దయ ప్రస్థానం వైపు నడిపించిన పాదాలు తమవి కాని " శిఖరాలను " అవలీలగా అధిరోహిస్తున్నయి. మేధస్సును సహృదయంతో  ప్రేమాన్విత మనస్సుతో సంలీన పరిచి ఉక్కు శరీరపు ...
READ MORE
ఈ సాధారణ సైనికుడి సొంత అన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.!!
మామూలుగ ఒక కుటుంబంలో ఎవరైన రాజకీయాల్లో గెలిచి అధికారంలో ఉంటే.. ఆ కుటుంబ సభ్యులంతా ఎలాంటి భోగాలు అనుభవిస్తారో అందరికీ తెలిసిందే.. అందులోనూ మన భారత దేశం లో అయితే ఇంక ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు.. సాధారణంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, ...
READ MORE
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
అనుకున్నదే జరిగింది. అమిత్ షా పర్యటన ముగియక ముందే ముందస్తు యుద్దం వచ్చేసింది. తెలంగాణ విషయంలో అవాకులు చెవాకులు పేలితే.. పేలిన వాడు ఎంతంటి వాడైనా జాన్తానై అని తేల్చేశారు తెలంగాణ బాద్ షా ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు. అమిత్ షా ...
READ MORE
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న డా. అపూర్వ రజినిలు.
పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఎలా చంపేద్దామా అని చూస్తున్న నేటి సమాజంలో.. ఆడపిల్ల పుడితే చాలు ఆసుపత్రి ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు ఉచితంగా అందించి తల్లినీ, పుట్టిన పాపను సగర్వంగా ఇంటికి దగ్గరుండి పంపిస్తోంది ఈ ఆస్పత్రి. అక్కడుండే డాక్టర్లు ...
READ MORE
అతనికి రెండు పెళ్లిల్లు అయ్యాయని తెలిసే.. మూడో పెళ్లి చేసుకున్న.!!
బోడుప్పల్ టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి మూడు పెళ్ళిల్ల వ్యవహారం.. రెండో భార్య సంగీత నిరసన దీక్ష వివాదం అందరికీ తెలిసిందే.. మొదటి భార్య స్వాతి కి విడాకులు ఇచ్చాడు శ్రీనివాస్ రెడ్డి, కానీ రెండో భార్య సంగీత కు విడాకులు ఇవ్నకుండానే ...
READ MORE
జర్నలిజం పవర్ ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రొ.కోదండరాం.. భవిష్యత్తు, కొత్త పార్టీ పై క్లారిటీ
తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మణ్ ప్రొ.కోదండరాం తాజాగా జర్నలిజం పవర్ ముఖముఖి కార్యక్రమంలో పలు ముఖ్యమైన ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆయన రాజకీయ పార్టీ పెట్టడం పై క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్ తెలంగాణ లో రాజకీయంగ ఉద్యమకారులు, విద్యార్ధుల పాత్ర ఏంటనే అంశం ...
READ MORE
Big Breaking- తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కే అప్పజెప్పిన అధిష్టానం.!!
చాలా తర్జన భర్జనల తర్వాత చాలా మంది నేతల పోటీ మధ్య ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది అధిష్టానం. దేశం లో అన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తున్నా.. తెలంగాణ కు మాత్రం పెండిగ్ లో పెట్టడం తో నిన్నటి వరకు కూడా ...
READ MORE
అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్.!!
ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్ అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి సంబంధించిన ఎన్నికల్లో కోశాధికారి పదవికై పోటీ చేస్తుండడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగ జరగనున్నాయి. కెంచె చంద్రశేఖర్ కి స్థానికంగ మంచి పేరుంది, సౌమ్యుడిగ వివాద రహితుడిగ అంతకుమించి అమ్మవారికి ...
READ MORE
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 25 శాతం తగ్గడంతో వరుసగా ఆరు రోజులపాటు పెట్రో ధరలు తగ్గాయి.  గత ఎనిమిది నెలల్లో పెట్రో ధరలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి. మంగళవారం డీజిల్‌పై 13 పైసల చొప్పున, పెట్రోల్‌ పై 25 ...
READ MORE
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న నెటిజన్లు.!!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది, అదే సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య. అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఇప్పుడైనా పొత్తుల ప్రభుత్వం ఏర్పడింది కానీ ...
READ MORE
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం క్యూ..!!
గబ్బిలాలు, కుక్కలు, పాములు, పిల్లులు, బొద్దింకలు, పురుగులు ఇలా చైనా ప్రజలు తినని ఫుడ్ అనేది ఉండదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కూడా చైనీయులు గబ్బిలాలు తినడం వల్లనే మనుషులకు సోకినట్టు నిపుణులు అంటున్నారు. దీంతో కరోనా వైరస్ ...
READ MORE
దేశంలో దిగజారుతున్న రాజకీయం.. ఓట్ల కోసం అక్రమ చొరబాటుదారులకు మద్దతు..!!
అస్సాంలో 40 లక్షల మంది బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ వలసదారులకు భారత పౌరసత్వం ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో.. ప్రతిపక్ష పార్టీలు వింత వాదన వినిపిపస్తున్నై. వారందరికీ పౌరసత్వం ఇవ్వకుంటే రక్తపాతం అల్లకల్లోలం చేస్తమంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నారు ప్రతిపక్ష ...
READ MORE
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా ఏంటో మరోసారి టాలీవుడ్ కి చూపించారు. ఫ్యాన్ పాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఒక్క టీజర్ తో తేల్చేశారు. బుడ్డోడంటే మాములోడు కాదని సీన్ సితారే అని నిరూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన ...
READ MORE
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
కామ్రేడ్స్.. కమ్యునిస్ట్స్.. నక్సల్స్.. ఎర్రదళం.!! పేర్లలో మార్పు ఉండొచ్చేమో గానీ సిద్దాంతం ఒక్కటే. కానీ ఆ సిద్దాంతాన్ని పాటించడంలోనే వెనకబడిపోయి జనాలకు దూరమయ్యారు కామ్రెడ్లు. ఎప్పుడూ హేతువాదం లౌకికవాదం అంటూ మైనారిటీలకు భజన చేస్తూ హిందూ సమాజం పై కన్నెర్ర చేస్తూ ...
READ MORE
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న సింగ‌రేణి కార్మిక సంఘం ఎన్నిక‌లు.. విజ‌య వ‌రించేది ఎవ‌రినో..?
సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్ర‌శాతంగా కొన‌సాగుతున్నాయి. హోరాహోరీగా సాగిన ప్రచారం ఆయా సంఘాల‌ను గెలిపించుకునేందుకు నాయ‌కులు గుప్పించిన హ