You are here
Home > తాజా వార్త‌లు > ఈతరం గుర్తించని మహానుభావుడు.. ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి చెప్పిన గొప్ప నాయకుడు.

ఈతరం గుర్తించని మహానుభావుడు.. ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి చెప్పిన గొప్ప నాయకుడు.

పదవి, అధికారం చేతిలో ఉంటే చాలు కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు వాటిని తమ స్వార్థం కోసం ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో వారు తమ కోసమే కాకుండా తమ కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఆ పదవి, అధికారాన్ని వాడుతారు. ఈ నేపథ్యంలో వారు సామాన్య జనాలను ఇక ఏమాత్రం పట్టించుకోరు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో దాదాపు నాయకులంతా ఇలాగే ఉన్నారు. కాకపోతే కొందరు బయట పడుతున్నారు. మరికొందరు బయట పడడం లేదు. అంతే తేడా. కానీ గతంలో మన దేశానికి ప్రధానిగా పనిచేసిన ఆ గొప్ప వ్యక్తి మాత్రం అలా కాదు. తన పదవిని, అధికారాన్ని సొంత పనుల కోసం, సొంత వారి కోసం ఏ మాత్రం ఉపయోగించుకోలేదు సరికదా ఆ పదవిలో ఉన్నందుకు తనకు ఇతరులు ఇచ్చే గౌరవాన్నే సాధారణ ప్రజలకు కూడా ఇవ్వాలని ఆదేశించి, ఇప్పటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఇప్పుడు తెలుసుకుందాం.

1965లో భారత ప్రధానిగా పని చేస్తున్న సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి ఫియట్ కారు కొనేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.5వేల లోన్ తీసుకున్నారు. బ్యాంక్ కూడా త్వరగానే లోన్ శాంక్షన్ చేసింది. కాగా ఆయన ఆ లోన్ మొత్తాన్ని చెల్లించకుండానే 1966లో కన్ను మూశారు. దీంతో బ్యాంక్ వారు ఆయన సతీమణి లలిత శాస్త్రికి లోన్ చెల్లించాలని లేఖ రాశారు. ఈ క్రమంలో ఆమె ఆ మొత్తాన్ని బ్యాంకుకు వాయిదాల పద్ధతిలో చెల్లించారు. కాగా ఆ ఫియట్ కారు శాస్త్రి కుటుంబీకుల ఇంట్లో ఇప్పటికీ ఉందట.

సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో అడ్మిషన్ కోసం శాస్త్రి కుమారుడు దరఖాస్తు చేసుకోగా ఆ అప్లికేషన్ ఫాంలో శాస్త్రి తన వృత్తిని ‘గవర్నమెంట్ సర్వెంట్’ అని రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా ఒక రోజు శాస్త్రి కుమారుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్లో నిరుద్యోగిగా దరఖాస్తు చేసుకునేందుకు లైన్లో వేచి ఉండగా అక్కడి క్లర్క్ ఒకతను శాస్త్రి కుమారుడ్ని ‘మీ తండ్రి ఏం చేస్తాడ’ని ప్రశ్నించాడు. అందుకు శాస్త్రి కుమారుడు తన తండ్రి ప్రధాన మంత్రి అని చెప్పగా అక్కడున్న వారందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారట. ఇవే కాదు, ఒకానొక సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న శాస్త్రి కుమారుడికి అర్హత లేకపోయినా ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చారట. ఈ విషయాన్ని తెలుసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే ఆ ప్రమోషన్ను నిలిపి వేయించాడట.

పైన చెప్పిన సంఘటనలు కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. వాటి గురించి తెలుసుకుంటే చాలు లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన కుటుంబ సభ్యులు ఎంత నిజాయితీగా, హుందాగా వ్యవహరించారో ఇట్టే అర్థమవుతుంది. కేవలం ఈ విషయాల్లోనే కాదు శత్రు దేశమైన పాకిస్థాన్పై భారత సైనికులు విజయం సాధించడం వెనుక కూడా శాస్త్రి ధైర్యం, తెగువ, ప్రోత్సాహం ఎంతో ఉందట. శత్రు దేశ సైనికులు దాడి చేస్తే దాన్ని తిప్పికొట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి లొంగ వద్దని, శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు, చివరి వరకు దేశం కోసం పోరాడాలని శాస్త్రి సైనికులను ఎప్పటికప్పుడు ప్రేరేపించేవారట. నిజంగా ఆయన లాంటి నాయకులు ఇప్పుడు చూద్దామన్నా లేరు కదా! ఏది ఏమైనా, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులంటే ప్రజలకు సేవ చేసే వారేనని, వారు స్వార్థం కోసం పనిచేయకూడదని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన మన దేశంలో పుట్టి ఇక్కడి ప్రజలకు సేవ చేసినందుకు నిజంగా మనం గర్వ పడాల్సిందే! 

Related Posts
దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన డా.లక్ష్మణ్
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ ఎంఎల్ఏ డా.కే.లక్ష్మణ్ ఓ ముఖ్యమైన సమస్యపై దృష్టి సారించారు. అదే దివ్యాంగుల సమస్యల అంశం. రెండు రోజుల క్రితం అసెంబ్లీ లో దివ్యాంగుల సమస్యలపై మాట్లాడిన డా.లక్ష్మణ్ ఈరోజు ...
READ MORE
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రావణ్ గురించి విస్తుపోయ నిజాలు బయటపడుతున్నాయి. కేసులో తొలి నుంచి రాజీవ్ పేరు ప్రధానంగా వినిపించినా.. ఏ1గా శ్రావణ్ ను చేర్చడం పట్ల పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రభాకర్ మృతికి ...
READ MORE
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో అధిష్ఠానం.!!
ఇప్పటికే అధికారం కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేనంత దీన పరిస్థితులను ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు సమీపిస్తున్న వేల ఊహించని దెబ్బలు తాకుతున్నై. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదస్పదమైన వ్యాఖ్యలు పెను దుమారం ...
READ MORE
నన్నూరి నర్సిరెడ్డి కి పోసాని ఖతర్నాక్ కౌంటర్.!!
మహానాడు సభలో జగన్ పై పిట్టకథలతో కామెడీ చేసాడు తెతెదేపా నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి. మహానాడు మీటింగ్ లో వైఠస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ కేవలం సీఎం సీటు కోసమే ఆరాటపడుతున్నాడనీ.. అందుకు ఎద్దేవా చేసేలా వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ ...
READ MORE
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న రాములమ్మ.!!
ప్రముఖ సినిమా నటి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి తొందర్లోనే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన బీజేపీ లోకి ఘర్ వాపసి కోసం తేదీ ఫిక్స్ చేసుకున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత ...
READ MORE
ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా నేత.
నిబంధనలను ఉల్లంఘిస్తూ బైక్ పై ట్రిపుల్ డ్రైవింగ్ ఫోటో తీసిన విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్కుటుంబ సభ్యులతో కలిసి చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా నేతహైద్రాబాద్ మౌలాలీ కమాన్ వద్ద మహ్మద్ గౌస్ అనే వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులతో ...
READ MORE
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కల్తీ కల్తీ కల్తీ.. ఉగ్గు పాల నుండి చివరి నిమిషంలో తాగించే తులసి నీళ్ల దాక కల్తీనే. ఉప్పు కల్తి, పప్పు కల్తి, ఆవాలు, జిలకర, మెంతులు, పసుపు, అల్లం ఇలా ఒక్కటేమిటి తాగే పాలు, నీళ్లు చివరికి తినే తిండి ...
READ MORE
చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా ధనం ఖర్చు..
రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వడం లేదంటూ.. హోదా కావాలంటూ.. రాష్ట్రం డబ్బు లేక అప్పుల్లో ఉందంటూ నిరసన దీక్షకు పూనుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగ 20 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. అప్పుల్లో ఉన్నామంటూనే ...
READ MORE
రికార్డ్ లు బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ.. రూ.15లక్షల 60వేలు.
బాలాపూర్ లడ్డూ వేలంపాట ఈ ఏడాది కూడా ఘనంగా కొనసాగింది. ఏడాదికేడాది రికార్డులను బ్రేక్ చేస్తూ భక్తి భావంతో విఘ్నేశ్వరుని లడ్డూను దక్కించుకుంటున్నారు భక్తులు. ఈ ఏడాది ప్రఖ్యాత బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ముగిసింది. గతేడాది రికార్డును బ్రేక్‌ చేస్తూ ...
READ MORE
రాజీనామా పై క్లారిటీ ఇచ్చిన మేయర్ బొంతు రామ్మోహన్.!!
మెట్రో రైల్ ప్రారంభానికి ప్రధాని మోడి హైద్రాబాద్ నగరానికి వచ్చిన విషయం తెలిసిందే.. అంతే కాదు అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ బిజినెస్ సదస్సు జరుగుతున్నదీ.. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు అమెరికా అధికారిక సలహాదారు ఇవాంక ట్రంప్ ...
READ MORE
దేశంలో కమ్యునిస్టులకు కాలం చెల్లినట్టేనా.?? సమగ్ర విశ్లేషణ.
దేశం లో అక్షరాస్యత పెరుగుతున్నకొద్దీ ఊహించని మార్పు సంభవిస్తోంది. ఏండ్లు దశాబ్దాల పాటు ఆధిపత్యం చూపించిన సాంప్రదాయాలు పూర్తిగా అంతరించిపోతున్నై. ఆధునికతను ఎవరూ పూర్తిగా విశ్లేషించలేకపోతున్నారు. ఈ పరిణామాలే కమ్యునిస్టుల అంతానికి నాంది పలుకుతున్నయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా ...
READ MORE
రాజస్థాన్ లో ఆ నేరం చేస్తే.. ఇకపై మరణ శిక్షే..!!
రాజస్థాన్ అసెంబ్లీ ఒక నూతన చట్టం తీసుకొచ్చింది. రాష్ట్రం లో ఇక పై మైనర్ అనగా 12 ఏండ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే.. మరణ శిక్ష విధించనున్నారు. దేశంలో ఈ తరహా చట్టం చేసిన రాష్ట్రం లో రాజస్థాన్ రెండో ...
READ MORE
పది నిమిషాల్లో హిందువులను చంపుతా అన్నవాల్లతో పొత్తు.. ధర్మం కోసం నిలబడ్డవాల్లపై బహిష్కరణలా.??
హిందూ సమాజం పై హిందూ ధర్మం కోసం న్యాయబద్దంగ చట్టబద్దంగ ఆత్మ గౌరవం కోసం పాటుపడుతున్న స్వామీ పరిపూర్ణనంద ను రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులుగ హౌజ్ అరెస్ట్ తో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ...
READ MORE
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం మధ్య గొడవ.!!
డ్రాగన్ కంట్రీ గ ఇప్పుడు కరోనా కంట్రీ గా పేరు తెచ్చుకున్న చైనా దేశం మరోసారి తన దుర్బుద్ధి ని ప్రదర్శించింది. ఉత్తర సిక్కిం భారత్ చైనా బార్డర్ వద్ద భారత భుబాగం లోకి చైనా ఆర్మీ చొరబడడం తో మన సైనికులు ...
READ MORE
ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్‌…
ఉత్తర కొరియా విషయంలో అమెరికాకు రష్యా ఊహించన షాక్‌ ఇచ్చింది. వరుస ఖండాండర క్షిపణుల (ఇంటర్‌ కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ మిసైల్స్‌) ప్రయోగాలతో అంతర్జాతీయ సమాజాన్ని ఉత్తర కొరియా భయభ్రాంతులుకు గురిచేస్తోంది. ముఖ్యంగా అమెరికాపై ఉత్తర కొరియా కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ...
READ MORE
PCC పదవి నుండి ఉత్తమ్ తప్పుకుంటే తర్వాత ఎవరు.?
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి, తెలంగాణ లోనూ కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలిచి కాస్త ప్రతిభ కనబర్చినా, ఉన్న ప్రతిపక్షం కూడా పోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటమి తో నాలుగేల్లుగ ...
READ MORE
తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు?
తెలుగు రాష్ట్రాలకు త్వరలో వేర్వేరు గవర్నర్లు నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల బాధ్యతలను నరసింహన్‌ ఒక్కరే చూసుకుంటున్నారు. కేంద్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే అవకాశం ఉందని ఓ ముఖ్యనేత వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటకకు చెందిన శంకరమూర్తి, ...
READ MORE
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్ట్.
మరోసారి కేసిఆర్ సర్కార్ కు మొట్టికాయలేసింది హైకోర్ట్. తెలంగాణ లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన నాటి నుండి చాలా సార్లు దాదాపు హైకోర్ట్ కి వెల్లిన ప్రతీ అంశంలోనూ కేసిఆర్ సర్కార్ ను నిలదీసింది న్యాయస్థానం. కాగా మొన్నటికి మొన్న నూతన ...
READ MORE
అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన తల్లి. అక్కున చేర్చుకున్న స్థానికులు.
కన్న పేగును తెంచుకుని పుట్టిందన్న కనికరం కూడా లేకుండా అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పల్లో పడేసింది ఆ కసాయి తల్లి ఓ పక్క జోరు వాన మరో వైపు చిమ్మ చీకటి గుక్కపెట్టి ఏడుస్తున్న పాప గొంతు విని స్థానికులు ...
READ MORE
మహా శివరాత్రి ప్రత్యేకం:- కీసర గుట్టపై శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం మహత్యం.!!
త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం తర్వాత సీతా దేవి సమేతా కీసర గుట్ట పరిసర ప్రాంతాల్లో అందమైన ఆహ్లాదమైన ప్రకృతి లో సేదతీరుతూ.. రావణ సంహారం కారణంగ బ్రహ్మ హత్య పాతకంతో దోష నివారణ కోసం శివలింగ ప్రతిష్ట చేయడానికి, మహావీరుడైన ...
READ MORE
పండుగల మాసానికి స్వాగతం.. శాకాహారం జిందాబాద్.
శ్రావణ మాసం తెలుగు పంచాంగంలో పండుగలకు పుట్టినిళ్లు. ఈ మాసంలో మహిళా మణులు అత్యంత భక్తితో చేసే పండుగలే ఎక్కువ. మంగళగౌరి వ్రతం, నాగుల పంచమి, భానుసప్తమి, పుత్రా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణాష్టమి ఇలా ఆడపడుచులు జరుపుకునే ...
READ MORE
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు ఫైల్.!!
ఈ మధ్య కాలంలో అశ్లీల చిత్రాలు తీసి కావాలని పబ్లిసిటీ పెంచుకుని జనాలు సినిమా చూసేలా చేసే ట్రిక్కులు పలువురు దర్శక నిర్మాతలు బాగానే వంటబట్టించుకుంటున్నారు.నెగిటివ్ టాక్ అయినా పాజిటివ్ టాక్ అయినా ఎదో ఒకటి పబ్లిసిటీ మాత్రం కావాలి. దాంతో ...
READ MORE
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి తరచూ అక్కసు వెల్లగక్కుతున్న సమైక్యాంధ్రవాది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి హైద్రాబాద్ నగరం పై తన అక్కసును వెల్లగక్కడం జరిగింది. హైద్రాబాద్ నగరాన్ని డెవలప్ ...
READ MORE
వలసవాద రోహింగ్యాలతో జాగ్రత్త.. మోడీని అప్రమత్తం చేస్తున్న జాతీయవాదులు.!!
ఇప్పుడు దేశమంతా చర్చనడుస్తున్న రోహింగ్యా ముస్లిం తెగలగురించి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరాలు వెల్లువెత్తుతున్నై.. దేశ భద్రత పై ఎట్టి పరిస్తతుల్లోనూ తగ్గేదిలేదని ఆ నరరూప రాక్షస తెగలపై ఏ చిన్న సానుభూతి చూపిన మన దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన ...
READ MORE
“మహర్షి” పేరుతో జనాల జేబులు ఖాళీ చేయడానికి సిద్దమైన థియేటర్లు.!!
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా "మహర్షి" కి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. విడుదల నుండి రెండు వారాల పాటు 80 టిక్కెట్ ను 110 గ మరియు మల్టీప్లెక్స్ లో ...
READ MORE
దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన డా.లక్ష్మణ్
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో
నన్నూరి నర్సిరెడ్డి కి పోసాని ఖతర్నాక్ కౌంటర్.!!
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న
ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా
రికార్డ్ లు బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ.. రూ.15లక్షల 60వేలు.
రాజీనామా పై క్లారిటీ ఇచ్చిన మేయర్ బొంతు రామ్మోహన్.!!
దేశంలో కమ్యునిస్టులకు కాలం చెల్లినట్టేనా.?? సమగ్ర విశ్లేషణ.
రాజస్థాన్ లో ఆ నేరం చేస్తే.. ఇకపై మరణ శిక్షే..!!
పది నిమిషాల్లో హిందువులను చంపుతా అన్నవాల్లతో పొత్తు.. ధర్మం కోసం
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం
ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్‌…
PCC పదవి నుండి ఉత్తమ్ తప్పుకుంటే తర్వాత ఎవరు.?
తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు?
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల
అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన
మహా శివరాత్రి ప్రత్యేకం:- కీసర గుట్టపై శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం
పండుగల మాసానికి స్వాగతం.. శాకాహారం జిందాబాద్.
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
వలసవాద రోహింగ్యాలతో జాగ్రత్త.. మోడీని అప్రమత్తం చేస్తున్న జాతీయవాదులు.!!
“మహర్షి” పేరుతో జనాల జేబులు ఖాళీ చేయడానికి సిద్దమైన థియేటర్లు.!!
Facebook Comments
Top
error: Content is protected !!