You are here
Home > సినిమా > ఉన్నది ఒకటే జిందగీ.. బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి తేడా ఇదే.

ఉన్నది ఒకటే జిందగీ.. బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి తేడా ఇదే.

‘హైపర్’ మూవీ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉన్నది ఒకటే జిందగీ’. రామ్ కెరియర్‌లోను ‘నేను శైలజా’ లాంటి బిగ్గెస్ట్ హిట్ అందించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ఈమూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈమూవీ ఆడియో విడుదల సందర్భంగా శుక్రవారం థియేట్రికల్ ట్రైలర్‌లను విడుదల చేశారు.

తాజా ట్రైలర్‌లో హీరో రామ్ రెండు డిఫరెంట్ గెటప్‌లలో అదరగొట్టేస్తున్నారు. అభిరామ్‌ అనే వ్యక్తి జిందగీలో చైల్డ్‌హుడ్, కాలేజ్‌ లైఫ్, కాలేజ్‌ తర్వాత లైఫ్‌ అండ్ లవ్‌ని ఈ సినిమాలో చూపిస్తున్నారు. అభిరామ్‌గా పాత్ర కోసం బాడీ మేకోవర్‌ కావడంతో పాటు సరికొత్త స్టైయిల్‌లోకి మారారు రామ్. రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు నటిస్తుండగా.. అతని నలుగురు స్నేహితులుగా శ్రీవిష్ణు, ప్రియదర్శి, కిరీటి, కౌషిక్‌ కనిపిస్తున్నారు.

Facebook Comments
Top
error: Content is protected !!