You are here
Home > సినిమా > తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు మాలిన రాతలున్నై.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు మాలిన రాతలున్నై.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక లేఖ రాసింది.
కొందరు నటులు డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మొత్తం ఇండస్ట్రీకే మచ్చ వస్తోంది.. ఇలా విచారించకండి అనేది సారాంశం.
తెలుగు సినీ పరిశ్రమ 2000 కోట్లు దాటింది దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చిందీ.. ఇలాంటి సమయంలో మమ్మల్ని డ్రగ్స్ కేసులో విచారిస్తారా అని ప్రశ్నిస్తూనే.. మీరు మంచి పనే చేస్తున్నారు కాబట్టి మేము కూడా సహకరిస్తాం.. పోలీసులకు కూడా సహకరిస్తాం అంటూ లేఖలో పేర్కొన్నారు.

*అయితే బయట కుటుంబ విలువలు లేకున్నా మేము పాటిస్తున్నం.. నేటి సమాజంలో విలువలే లేకున్నా సమాజాన్ని మేమే గౌరవిస్తున్నం లాంటి రాతల్ని చూసీ.. జనాలు ముక్కున వేలేసుకుని అవాక్కవుతున్నారు.

అంతే కాదు ఎవరికో కష్టమొస్తే జోలె పట్టుకుని అడుక్కుని వారి కష్టాలను తీర్చాము మమ్మల్నే మీడియా తప్పు పడుతుందా అంటూ మీడియానీ కూడా అడిగేసారు.

ఈ రకమైన రాతలపై జనాలు గుర్రుమంటున్నారు. జనాలు ఆదరించకుంటే అసలు ఈ సినీ పరిశ్రమ ఉండేదా అని ప్రశ్నిస్తున్నారు.
అలాంటిది జనాలను అవమానిస్తూ.. ఎవరో అనడం.. సమాజంలో విలువలే లేవు మేమే సినిమాలతో సమాజంలో విలువలు పెంచుతున్నం అని అనడం మూర్కత్వమే అవుతుందంటున్నారు విశ్లేషకులు. ఇది అజ్ఞానంతో డబ్బు హోదా గర్వంతో కల్లు మూసుకుపోయి రాసిన లేఖగా పేర్కొంటున్నారు.


ఏకంగా సమాజంలోని కుటుంబ విలువలనే ప్రశ్నిస్తున్న వారికి వారు కూడా ఆ కుటుంబాల నుండే వచ్చిన విషయం విస్మరించడం సిగ్గుచేటని అంటున్నారు.

నిజంగా సమాజం పైనా ప్రభుత్వాల పైన ప్రజలపై ప్రేక్షకుల పైన గౌరవం ఉంటే ఇలా దిగజారి మాట్లాడేవారు కాదని సామాజికవేత్తలు అంటున్నారు.
డ్రగ్స్ వాడిన వారిపై డ్రగ్స్ దందా చేసిన వారిపై మేము క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామంటూనే.. మేం తప్పుచేయలేదు విచారణ హుందాగ చేయాలని కోరడం సారాంశమేంటో వారికే తెలియాలి మరి.
సినిమాలు విడుదల సమయంలో అభిమానులే మాకు అన్నీ.. జనాలే లేకుంటే మేము లేము.. మాకు ఈ హోదా లేదని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చేవారు ఇప్పుడు ఎవరో జనాలంటూ.. సమాజం మొత్తం చెడిపోయిందీ..అందరి కుటుంబాలు విలువలు కోల్పోయాయి మేమే పచ్చి నీతివంతులం అని పిచ్చి రాతలు రాయడం బహుశా తెలుగు సినీ ఇండస్ట్రీ వాల్లకే చెల్లిందేమో మరి.

విచారణ మొదలై కూడా మూడు వారాలైతుంది, మొదట్లో.. ఆ ఏం చేస్తారులే చూద్దాం అనుకున్నారేమో ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు.. తాజాగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం డ్రగ్స్ కేసులో రెండో లిస్టు తయారైంది త్వరలో పేర్లు చెప్తాం.. అందులో పేర్లన్నీ పెద్ద మొహాలయే అని లీకులియ్యడంతో చలనం వచ్చినట్టు ఉంది..

మరి ఆ రెండో లిస్టులో ఎవరెవరి పేర్లుంటయో.. ఈ లేఖ పై సీఎం కేసిఆర్ ఏ విదంగా స్పందిస్తారో.. అసలు స్పందిస్తారో లేదో ముందు ముందు తెలుస్తది. 

Related Posts
పవన్ కాదంటే “నంద్యాల” లో టీడీపీ గల్లంతేనా..??
ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక హాట్ టాపిక్ అయింది. అధికార తెలుగు దేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్సపీ లు హోరా హోరీగ తలపడుతున్నాయి. కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలున్నా అవి డమ్మీలుగానే మిగలనున్నాయి. 2014 లో భూమా నాగిరెడ్డి జగన్ ...
READ MORE
అష్టమ వ్యసనం.. స్మార్ట్‌ ఫోన్‌. ఈ వ్యసనం భారీన పడ్డారో ఇక అంతే.
‘‘టెక్నాలజీలు పెరిగి చేతుల్లోకి ఫోన్లొచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గాలిగానీ.. ఇలా పెరిగిపోతోందేమిట్రా’’ ఓ ప్రశ్న.. సమాదానం ‘‘తప్పు టెక్నాలజీలో లేదు బాబాయ్‌. దాన్ని వాడే మనుషుల్లోనే ఉంది’’ నిజమే.. తప్పు మనలోనే ఉంది. దాన్ని సరిదిద్దుకోగలిగే తెలివీ మనలోనే ఉంది. ...
READ MORE
పవన్ కాదంటే “నంద్యాల” లో టీడీపీ గల్లంతేనా..??
అష్టమ వ్యసనం.. స్మార్ట్‌ ఫోన్‌. ఈ వ్యసనం భారీన పడ్డారో
Facebook Comments
Top
error: Content is protected !!