
టాలీవుడ్ దర్శకుడు కం నటుడు అయిన రవి బాబు తెరకెక్కిస్తున్న చిత్రం అదుగో. మరో సారి సరికొత్త లుక్ తో తన చిత్ర టీజర్ విడుదల చేశాడు. జనం ఏం అనుకుంటున్నారో తెలియదు కానీ తనకు తానుగా చెత్త దర్శకుడు అని టీజర్ లో చెప్పించుకున్నాడు. అది కూడా పందితో చెప్పించి మరో రాంగోపాల్ వర్శ అని నిరూపించుకున్నాడు రవిబాబు. ఎప్పుడు వింతగా ఆలోచించే రవిబాబు ఈ సారి అంతకు మించిన తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. బంటి అనే పంది పిల్లను ప్రధాన పాత్రలో పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం టీజర్ కూడా అంతే సరికొత్తగా రిలీజ్ చేశాడు. కాస్త ఎబ్బెట్టుగా మరి కాస్త వికారంగా ఇంకాస్త హస్యంగా ఉన్న ఈ టీజర్ ఇప్పుడు యూ ట్యూబ్ లో సందండి చేస్తుంది. ఇక టీజర్ లో ‘సినిమాలో బంటి చాలా బాగా నటించాడు’ అని రవిబాబు పొగుడ్తుంటే.. ఇందుకు బంటి కౌంటర్‌గా ‘వీడు మాత్రం డైరెక్షన్ చాలా నీచంగా చేశాడు’ అంటుంది. దాంతో రవిబాబుకు కోపం వచ్చి ‘రేయ్ కోటి.. వీడిని ముక్కలు ముక్కలుగా నరికి బిరియాని చేసి సాయంత్రం నాకు పార్శిల్ పంపు’ అనడం నవ్వులు పూయిస్తోంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.