You are here
Home > సామాన్యుడు > విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు కాదు పచ్చని బంగారు నేలలు కావాలి..

విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు కాదు పచ్చని బంగారు నేలలు కావాలి..

పచ్చదనం అల్లుకున్న పల్లెలు కాలకూట విషాన్ని మింగి ఎండి ఎడారి కానున్నాయని తెలిసి.. ఒక వ్యక్తి శక్తిగా మారి పల్లెలను కాపాడుకునేందుకు పోరాటానికి దిగితే.. అడుగడుగునా అడ్డుకునేందుకు దుష్టశక్తులు కుటిల యత్నాలు చేస్తున్నాయా..? వ్యవస్థలో తప్పును ఎత్తి చూపి సరైన మార్గంలో వెళ్లకతప్పదని కొత్త దారిని ఎంచుకుంటే ఆ దారిని పూర్తిగా మూసివేయాలని కుట్రలు పన్నుతున్నారా..? పల్లె ప్రగతికి పచ్చని అందాలని కానుకగా ఇవ్వాలని
కోరుకోవడమే ఆ వ్యక్తి చేసిన తప్పా..? విషనాగులను అడ్డుకునేందుకు విశ్వమానవ వేదికను ఏర్పాటు చేసుకుని ముందుకు నడిస్తున్న ఆ వ్యక్తిని పగ పట్టిందెవరు..? దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలను కాపాడుకునేందుకు చేస్తున్న అతని పోరాటాన్ని అనగదొక్కిందెవరు.? అధికార దర్పానికి ఓ సామాన్యుడు ఆహుతి అవ్వాల్సిందేనా..? తన ఆశయం నీరు గారాల్సిందేనా..? అందరి గొంతుకగా నినదించిన ఆ గొంతు ఇప్పుడెందుకు బంధీ అయింది..?

స్నేహితుని కోసం తన వంతుగా అక్షరగళాన్ని వినిపించిన జర్నలిస్ట్ thulasi.chandu మాటలు యథాతథంగా…

వాళ్లు చేతులు అడ్డం పెట్టారు.. నువ్వు ప్రకాశించడం మానెయ్ !!

శ్రీకాకుళంలో పాత్రికేయుడిగా ఉన్నప్పుడు నీ జీతం నువ్వు తీసుకుంటూ, కన్నెధార కొండ వైపు తిరిగి చూడకుండా ఉంటే నాటి మంత్రులు నీపై దాడులకు తెగబడే వాళ్లే కాదు. ఇవాళ వార్త రాసి రేపు దాన్నే అధికారగణానికి అనుకూలంగా తిరగరాస్తూ కూడా జర్నలిస్టులుగా చెలామణీ అయ్యే మెజారిటీ పాత్రికేయకులంలో చెడబుట్టావేమో. గిరిజనుల గురించి నీకెందుకు. వాళ్ల గుండె చప్పుడుకూ, కన్నెధార కన్నీటి ధారలకూ ఆ నాటి ఈనాడును తెరచాపగా ఎత్తిపట్టావ్. ఫలితంగా కన్నెధార గిరిజనుల గూడాల్లో నీపై ఉన్న ప్రేమాభిమానాలు, నాటి మంత్రి ధర్మాన గుండెల్లో నువ్వంటే ఉన్న భయం ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసి ఉండొచ్చు. కన్నెధారపై ఎవరి కన్నూ పడకుండా నాటి నీ కథనాలు ఇప్పటికీ కాపలా కాస్తూ ఉండొచ్చు. కానీ నీకేమొచ్చింది వాటి వల్ల..? అంతటితో పాత్రికేయుని ముసుగులో నీ ప్రజాపోరాటాలను వదిలిపెట్టాల్సింది. ఆ తర్వాత ఏకంగా ముసుగు తీసి, రాజీనామా చేసి పూర్తి స్థాయి ఉద్యమకారుడిగా ఎందుకయ్యావ్..?

కన్నబిడ్డలే కావాలని వదిలించుకున్న వృద్ధుల గురించీ, కన్నవారే వద్దని దూరం పెట్టిన వికలాంగుల గురించి, వీధుల్లో బిక్షాటన చేసే నిర్భాగ్యుల గురించి నీకెందుకు..? ప్రపంచంలోని ప్రతి మనిషీ నా వాడే అని విశ్వమానవ వేదిక పెట్టావ్. వృద్ధులనూ, వికలాంగులనీ విహారయాత్రకు తీసుకెళ్లిన మొదటిరోజే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థమైపోయింది. గోదావరి ఒడ్డున పుట్టిన వికలాంగులు ఎప్పుడూ ఆ తీరంలో ఆడుకోలేదట తులసీ అని తెగబాధపడిపోయావ్. వాళ్లను ఫస్ట్ టైమ్ సముద్ర తీరానికి తీసుకెళ్లిన రోజు వాళ్ల కళ్లలో నిన్ను చూసి కూడా ఊహించాను ఇలాంటి రోజు ఒకటొస్తుందని. నీకెందుకు అంత మానవత్వం..? ఇలా ఎవరైనా అంటే చె గెవారా, భగత్ సింగ్, అల్లూరి, కారల్ మార్క్స్ అని క్లాస్ తీసుకుంటావ్. ముప్ఫై ఏళ్ల నీ వయసుకీ నీ మాటలకూ, చేతలకూ ఏమైనా సంబంధముందా.. ? నువ్వే అనుకుంటే నిన్ను మించిన నీ సహచరి. ఆమె డాక్టర్ చదివింది కదా.. ఏ కార్పొరేట్ హాస్పిటల్లోనో చేరి లక్షలు వెనకేసుకోకుండా పాలకొల్లులో మీకేంపని..? అంత పెద్ద చదువు చదివిన జ్ఞానేశ్వరి మంచి జీవితాన్నీ, అయిన వాళ్లనూ వదిలి నీ వృద్ధాశ్రమానికి రావడమంటే కోరి కష్టాలను తెచ్చుకోవడం కాదా..? పెళ్లైన మర్నాడు నుంచే ఆ కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవిస్తున్నా ఆమె నిన్ను మార్చే ప్రయత్నం చెయ్యలేదు.
అక్కడున్న ఆడవాళ్లు తాగుబోతు భర్తల్ని భరించలేక పిల్లల్ని చదివించే మార్గం లేక ఆగమాగం అవుతోంటే మీ ఇద్దరికీ ఏంటి..? వాళ్లతో గోదారమ్మ ఫుడ్స్ పేరుతో ఆహారపదార్థాలు తయారు చేయించి స్వయం ఉపాధి మార్గం చూపినంత మాత్రాన మీకు ఒరిగిందేంటి..? రక్తదాన శిబిరాలు, అనాధ శవాలకు దహన సంస్కారాలు చేయించండం, గల్ఫ్ దేశాల్లో మోసపోయిన వారికి అండగా నిలవడం వంటివి చేస్తూ మీరేం సాధించారు..? ఓ నీలి సైన్యాన్ని తప్ప..!!

‘ఉద్యోగం వదిలి వృద్ధాశ్రమం పెట్టుకున్నోడివి నీకు ఉద్యమాలెందుకు బాస్’.. మీ పాలకొల్లు ఎమ్మెల్యేనే కాదు.. నేను కూడా అడుగుతున్నా చెప్పు.. ? మెగా ఆక్వాఫుడ్ పార్క్ వద్దని ఆ ప్రాంత రైతులు రెండేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నారు. అప్పుడు ఎవరూ వాళ్ల గొడవ పట్టించుకోలేదు. వాళ్ల గొడవ నీకెందుకంటే, రైతు బాధ మన బాధ కదా అనే సో కాల్డ్ ఆన్సర్ ఉంటుంది నీ దగ్గర. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తెస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆలోచించావేగానీ, నువ్వు సమస్యల్లో పడతావని ఎందుకు ఊహించలేదు..? పవన్ కల్యాణ్ ఒక్క ప్రెస్ మీట్ పెట్టి హీట్ పెంచాడు, అప్పట్నుంచే కదా అధికారయంత్రాంగం నీపై వేట మొదలు పెట్టింది. ఆ రోజు అంత పెద్ద మాటలు చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడేమైపోయాడో చూశావా..? ఆ తర్వాత నీ వృద్ధాశ్రమానికి అర్థరాత్రి నిప్పు పెట్టారు, నీపైనా, నీకు మద్దతుగా నిలబడ్డ Journalist Ravi పైనా హత్యాయత్నాలు చేశారు. నువ్వొక దళిత వ్యతిరేకివని పాలకొల్లంతా ఫ్లెక్సీలు కట్టారు, నీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఆ ప్రాంత రైతులు, ఆందోళన చేస్తున్న మహిళలైనా నీకు నచ్చచెప్పకపోగా వాళ్ల గుండె ఘోషకు నువ్వే గొంతకవు అన్నంతగా ఉద్యమానికి కాలు దువ్వారు. ప్రతి ఇంటి ముందూ పోలీసుల్ని పెట్టినా, నెలల పాట 144 సెక్షన్ పెట్టినా.. వందల మందిని అరెస్టులు చేసినా ఆ వార్తలు ఎందుకు ప్రధాన పత్రికల్నీ, మీడియానూ తాకడం లేదో మాజీ జర్నలిస్టుగా నీ అనుభవం నీకు చెప్పలేదా..? గొంతేరు కాల్వ విషతుల్యం అయిపోతే నీకేంటి.. ? వ్యర్థ రసాయనాలు గోదారిలో, రైతుల పొలాల్లో కలిస్తే నీకేంటి..? వాటి వల్ల నువ్వు, నీ వృద్ధాశ్రమం నష్టపోతారా, లేదా కదా. మహా అయితే పచ్చని గోదారి కొన్నాళ్లకు కాలుష్యకాసారమౌతుంది. 15 వందల మందికి ఉద్యోగాలొస్తాయి. లక్షలాది రైతులు పంటలు పండక, నీళ్లు లేక వలసబాట పడతారు. లేదా రాయలసీమ, తెలంగాణల్లోలాగా గోదావరిలోనూ రైతు ఆత్మహత్యల వార్తల్ని చదువుతాం. హైదరాబాద్ ఆసుపత్రులు గోదావరి క్యాన్సర్ రోగులతో నిండిపోతాయేమో. అంతే కదా. అయినా నీకెందుకు..?

అధికారంలో ఉన్నవాళ్ల అడుగులకు మడుగులొత్తాలేగానీ ప్రశ్నిస్తావా..? మీపై అట్రాసిటీ కేసులు పెట్టాక కూడా ఫేస్ బుక్ వేదికగా ఎమ్మెల్యేని ‘పాలకొల్లు నియంత’ అని సంభోదించావంటే ఏం చూసుకొని అంత ధైర్యం..? వాళ్లు తలచుకున్నారు.. నువ్వు మళ్లీ నీ వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన విహారయాత్ర రోజే నిన్ను అరెస్ట్ చేశారు. నువ్వు తలచుకుంటే ఏం చెయ్యగలవు. మహా అయితే.. పాలకొల్లులోని యువతనంతా నీ నీలి సైన్యంగా ఉద్యమసైన్యంలోకి లాక్కొచ్చినట్లు.. నరసాపురం సబ్-జైల్లోని ఖైదీలను కూడా నీ సైన్యంగా, నీ అభిమానులుగా మార్చుకోగలవు. పాలకొల్లులోని యువత బుర్రల్లోకి చె గెవారాను ఎక్కించినట్లే ఖైదీల మనసుల్లోకి ఆ విశ్వ మానవుడిని ఇంజక్ట్ చెయ్యగలవు. అక్కడున్నా.. నీ అభిమానుల గుండెల్లో మెలిపెట్టే పోరాటానివై ఆక్వాపార్క్ నిప్పు ఆరిపోకుండా కాపాడగలవు. అవసరమైతే మరోసారి పాలకొల్లు నియంత పాలనకిందికి రాకుండా ఉద్యమ కార్యాచరణ ప్రకటించగలవు. అంతే కదా. జైల్లో పెడితే ఏం చేస్తావని అడిగినప్పుడు నువ్వన్న మాటలు మరచిపోలేదు. ‘స్వాతంత్ర్య పోరాటంలో లేము.. అడవుల్లో అన్నల్లా బతికేంత పెద్ద త్యాగం చెయ్యలేదు. ఇలా రైతాంగ పోరాటంలో పాల్గొన్న కారణంగా రాజ్యం కక్ష సాధించినా నాకు అదొక గొప్ప అవకాశమే’ అన్నావ్. ఇక నీలాంటి వారిని మార్చడం సాధ్యం కాదు. మారిపోవడం తప్ప.. !
..కానీ మిత్రమా ఈ జైలు జీవితమే నీ భవిష్యత్తు ఉద్యమ కార్యాచారణ రచించుకోవడానికి ఆటంకం లేని వేదిక అని తెలిస్తే మీ నియంతకు నిద్ర పడుతుందంటావా.. ??!!

–తులసి, నీ స్నేహితురాలు

(పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో వస్తున్న మెగా ఆక్వాఫుల్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న Mallula Suresh అరెస్టయినందుకు బాధ లేదు.. అది ఊహించినదే. కానీ అతను ప్రేమతో నిర్మించుకున్న విశ్వమానవ వేదిక అనే వ్యవస్థను నాశనం చేసే కుట్ర జరుగుతోంది. అతను జైలు నుంచి తిరిగి వచ్చేలోపు విశ్వమానవ వేదికను ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జరుగుతున్న ఘోరాలను గురించి రాయడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్న నిస్సహాయతకు బాధేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఓ గొప్ప నాయకుడిని మాత్రం ఊహిస్తున్నా..) 

Related Posts
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
కేంద్రంకు మిర్చి రైతులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. కాలిపోతున్న మిర్చి పంటను కాపాడేందుకు కనికరం చూపించింది. ఎంతనో తెలుసా అక్షరాల పన్నెండు.... వేలనుకునేరు వందలే. 1250 రూపాయల ఇది అదనం అంటా..? మరి అసలెంతో అనే కదా.. అక్కడికే వస్తున్నాం. కేంద్రం ...
READ MORE
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు యావత్ దేశం ఆలోచించింది.. కుల మతాలకు అతీతంగా అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.జనతా కర్ఫ్యూ వలన దాదాపు దేశంలో అత్యవసర సేవలు తప్ప అన్ని సముదాయాలు రవాణా వ్యవస్థ నిర్బంధం లో ఉండిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ...
READ MORE
జాట్ అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు.!!
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జాట్) అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ జర్నలిస్ట్ పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు పలువురు జర్నలిస్టులు మరియు సామాజిక వేత్తలు మేధావుల సమక్షంలో ఘనంగ జరిగాయి. ఈ సంధర్భంగ పలువురు ప్రముఖులు పగుడాకుల బాలస్వామి ...
READ MORE
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి.. ఉద్య‌మాల పోరుగ‌డ్డ‌.. మ‌లిద‌శ ఉద్య‌మంలో శ‌త్రువుకు చెమ‌ట‌లు పుట్టించి ఢిల్లీ నాయ‌కుల త‌ల‌లు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించి పెట్టి పోరాటాల గ‌డ్డ‌.. ఎంద‌రో అమ‌ర‌వీరుల‌కు అమ్మ‌.. మ‌హోన్న‌తుల‌కు పుట్టినిల్లు మ‌రి అంత‌టి ఘ‌న చరిత్ర క‌లిగిన ...
READ MORE
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక హట్టర్ ఫ్లాప్ స్టోరీ.
నయీం.. నయీం.. నయీం 2016.. ఆగస్టు 8 ఉదయం 9 గంటలకు.. తెలుగు మీడియ ఒక్కసారిగా బద్దలైంది. బిగ్ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ యావ ద్ తెలుగు రాష్టాలకు సంచలన వార్తను అందిం చింది. నర రూప రాక్షసుడు, ...
READ MORE
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
• పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్లకి క్యారక్టర్ లేదంటామ్.. పక్కన అమ్మాయి అలా కనిపిస్తే చాలు సొళ్లు కారుస్తాం. • మూత్రం మాత్రం ఎక్కడైనా పోయెచ్చు కానీ ముద్దులు మాత్రం రోడ్ల మీద పెట్టుకోవద్దు. • ప్రతి తల్లి తన కూతురుకి చెప్పేది ...
READ MORE
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్ లు దాటితే మీ పంటపండినట్టే.
ఏంటి లైక్ లకి రుణాలా..? వెయ్యి లైక్ లు దాటితే లక్ష రూపాయల రుణాలిస్తారా. ఎందుకయ్యా ఫేక్ న్యూస్ లు రాస్తారు అని తీసిపారేయకండి ఇది నిజంగా నిజమైన లైక్ ల కథే. అయితే మీరు చేయాల్సిందల్లా మీ కష్డాలను మీరు ...
READ MORE
కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్ పోలీసులు.
ఖాకీలంటే కర్కశత్వం కాదు మానవత్వం అని నిరూపించారు కరీంనగర్ పోలీసులు. మాలో కూడా మనసున్న మారాజులున్నారు అని తెలిసేలా ఓ తండ్రిలేని ఆడబిడ్డకు అన్ని తామై దగ్గర ఘనంగా పెళ్లి చేశారు. అందరి చేత శబాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు ...
READ MORE
మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే అమ్మేసింది.
అమెజాన్ మాటికి మాటికి బరి తెగిస్తూనే ఉంది. ఆ మద్య గణేషుడి బొమ్మను చెప్పులపై ముద్రించి.. ఆ తరువాత భారత జాతీ గౌరవాన్ని మంటగలిపేలా డోర్ మ్యాట్ల పై జాతీయ జెండాను అచ్చు వేసి అమ్మకానికి పెట్టింది. ఇలా రోజు రోజుకు ...
READ MORE
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న డా. అపూర్వ రజినిలు.
పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఎలా చంపేద్దామా అని చూస్తున్న నేటి సమాజంలో.. ఆడపిల్ల పుడితే చాలు ఆసుపత్రి ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు ఉచితంగా అందించి తల్లినీ, పుట్టిన పాపను సగర్వంగా ఇంటికి దగ్గరుండి పంపిస్తోంది ఈ ఆస్పత్రి. అక్కడుండే డాక్టర్లు ...
READ MORE
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
న్యాయం గెలిచింది. ఎన్నాళ్లకు గెలిచిందనే దానికంటే ఎట్టకేలకు గెలిచింది అని చెప్పడమే ఉత్తమం. తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటంలో కఠిన శిక్షను అనుభవించి చేయని తప్పుకు శిక్ష పడి కాళ్లు చేతులు చచ్చుబడిపోయి చివరికి ప్రాణాలతోనే సత్యం న్యాయాన్ని గెలిచాడు. మరీ ఇక్కడ ...
READ MORE
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
ఇస్లాం మతం నిబంధనల పరంగ ఇప్పటిదాక ముస్లిం మహిళలు ఎందరో ట్రిపుల్ తలాక్ బారిన పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకున్నారు.మూడు సార్లు తలాక్ తలాక్ తలాక్ అంటే చాలు ఆ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చినట్టే ఇందులో మరో ఉండదిక. ...
READ MORE
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా చెస్తరా..?
"ఉద్యమ గడ్డకే సంకెళ్లా.. రాష్ట్రానికి ఊపిరి పోసిన తల్లికే స్వేచ్చ బంధా..? ఇదే నా తెలంగాణ రాజ్యం. ఇదేనా స్వేచ్చ గీతం. ఉక్కు పిడికిళ్లకు సంకెళ్లెస్తే ఏం జరుగుతుందో తెలియదా. ఉప్పెనను ఆపాలని చూస్తే ఏం అవుతుందో కొత్తగా చెప్పాలా..?'' తెలంగాణ ఉద్యమానికి ...
READ MORE
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం భారీగ అప్పు చేసిన విషయం వెల్లడైంది. రాష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం రూ69,517 వేల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడది ఐదేల్లలో 159% పెరుగుదలతో రూ1,80,239 కోట్లుగ తయారైంది. ...
READ MORE
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
నర్స్.. ఈ మాటకు నిర్వచనం ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ. నిజమే పుట్టగానే తల్లి గర్భం నుండి ఆమె చేతుల్లోకే సగం లోకం వెళ్లేది. ధరించే దుస్తుల్లానే వారి మనసులు సైతం స్వచ్చంగా తెల్లగా మెరిసేవి. అయితే ఎక్కడో ఓ లోటు.. ...
READ MORE
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి 'శయన' ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. సంవత్సరంలో ...
READ MORE
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య కూతురు.!!
దేశమంతా చైనా కరోనా వైరస్ వల్ల పూర్తిగా లాక్ డౌన్ లో ఉంది. వైరస్ కారణంగా దేశంలో ఇప్పుడు ఫేస్ మాస్క్ లకు సానిటైజర్లకు బాగా డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ ఉండడంతో కొరత కూడా ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ ...
READ MORE
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
తెలంగాణ రాష్ట్రం.. శాంతి భద్రతలకు మారుపేరుగ గట్టి నిఘా కు నిలయంగ క్రిమినల్స్ కంట్రోల్ ఉన్నారనుకుంటే.. గత కొంత కాలం నుండి రాష్ట్రం లో పలు హత్యలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలెక్కడ ఏం జరుగుతుందో అని అనునిత్యం ఆలోచించాల్సిన ...
READ MORE
హారతిస్తే టీవీని పగలగొట్టడమేంట్ర స్టుపిడ్.!పాక్ క్రికెటర్ అఫ్రిది సైకో బుద్ధి.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పై జరుగుతున్న వివక్ష గురించి సర్వత్రా చర్చిస్తున్న నేపథ్యం లో మొన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మరో క్రికెటర్ హిందువైన డానిష్ కనేరియా పై ఎలాంటి వివక్ష చూపించేవాల్లమో అని చెప్పిన వీడియో ...
READ MORE
శ్రీ శ్రీ జయంతి నేడు రికార్డ్ల ప్రకారం..
న్యాయం గెలుస్తందన్న మాట నిజమే కానీ గెలిచిందంతా న్యాయమే కాదన్నది ఆయన మాట. నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చానని గర్జించిన.. విప్లవ కవి.. సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన మహాకవి.. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక ...
READ MORE
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులు.!!
తీవ్ర వరద ముంపుతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తనవంతు సహాయంగ అండగ నిలుస్తున్నారు అనిష్ కాలేజ్ యాజమాన్యం అనిల్ కుమార్ ఠాకూర్. కేరళ విపత్తులు సంభవించిన వెంటనే స్పందించిన చైర్మన్ అనిల్ కుమార్ ఠాకూర్ కాలేజ్ సిబ్బందితో మాట్లాడి వారందరి సహాయంతో ...
READ MORE
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
సిద్దిపెట్ జిల్లా దుబ్బాక మండలం రామాయంపేట్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి ఎన్ రమేష్. ఆయన గారాలపట్టే పదమూడేండ్ల సుస్మిత. అందరి పిల్లల్లా ఆడుతూ పాడుతూ పాఠశాలకు పరుగులు పెట్టే ప్రాయం తనది. చదువుల్లో సరస్వతిలా దూసుకుపోయే జ్ఞానం తనది. కానీ ...
READ MORE
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
శతాబ్దాల నుండి వివాదం లో ఉండి గత ఏడాదే సుప్రీం కోర్టు లో లైన్ క్లియర్ అయిన అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సిద్దమవుతోంది.ఆలయ నిర్మాణానికి కట్టుబడి ఉన్న బీజేపీ సర్కార్, నిర్మాణం కోసం అధికారికంగా శ్రీ రామ జన్మ భూమి ...
READ MORE
లక్షల్లో జనం సొమ్మును జీతాలుగ పొందుతున్నా.. లంచాలకు అలవాటుపడుతున్న కక్కుర్తి అధికారులు.!!
ప్రభుత్వం పాలకులు ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినా, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎంత కట్టుదిట్టంగ పనిచేస్తున్నా, కక్కుర్తి అత్యాశ ఎక్కువ ఉన్న ప్రభుత్వ అధికారుల ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. చదువుకున్నామన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయి సిగ్గు లేకుండ ...
READ MORE
కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల సిఎంలు నిద్రపోతున్నారా..??
రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలను కట్టడి చేసి, సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే దశలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలను రెండు రూపాయల యాభై పైసల మేరకు తగ్గించింది. అంతే కాదు రాష్ట్రాలు సైతం మరో రూ ...
READ MORE
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
జాట్ అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు.!!
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్
కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్
మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
హారతిస్తే టీవీని పగలగొట్టడమేంట్ర స్టుపిడ్.!పాక్ క్రికెటర్ అఫ్రిది సైకో బుద్ధి.!!
శ్రీ శ్రీ జయంతి నేడు రికార్డ్ల ప్రకారం..
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
లక్షల్లో జనం సొమ్మును జీతాలుగ పొందుతున్నా.. లంచాలకు అలవాటుపడుతున్న కక్కుర్తి
కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!