నేటి తరం జీవితాలను నాటితరంతో పోలిస్తే… ఓ కవి రాసిన గేయం గుర్తుకు రాక మానదు. “మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు చూడు మానవత్వం ఉన్నవాడు”. సొంత కొడుకులు కన్న కూతుర్లు ఈ యాంత్రిక జీవన పోరాటంలో పడి ఆఖరికి కన్న తల్లిదండ్రులను కూడా మరిచిపోయే పరిస్థితికి చేరుతున్నారు.. కారణం ఏంటి..? భారతీయ విలువలు చెపుతున్నదేంటి.. మనం పాటిస్తున్నదేమిటి..?
ప్రపంచానికి తల్లిదండ్రుల గొప్పదనం చెప్పింది భారతీయ సంస్కారం. చూపులేని తల్లిదండ్రులను తన భుజాల పై మోసిన శ్రవణ కుమారుడు భారతీయుడు.. మనమేమో తల్లిదండ్రులను నిర్థాక్షిణ్యంగ బాద్యతను మరచీ వదిలేస్తున్నం. ఒకప్పుడు భారతీయులంటే తల్లిదండ్రులకు గుడులు కట్టేవారు.. నేటి వాటి స్థానంలో వృద్దాశ్రమాలు వచ్చి వెలుస్తున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న వృద్దాశ్రమాలు అసలు దేనికి సంకేతం..? ఎటు పోతోంది మన భారతదేశం..?
ఏ వృద్దాశ్రమం వెళ్లి అడిగినా వినిపించే సమాదానం ఒకటే. “అసలు మాకెవ్వరున్నారని” బిడ్డా.. ముసలి వాళ్లమైపోయాము ఒకేసారి చంపలేకే ఇలా ఇక్కడకు తెచ్చి పడేసారని వారు చెప్పే సమాధానం వింటే కన్నీళ్లు రాక మానవు. అయిన వారుండి ఆలనా పాలనా చూడాల్సిన బిడ్డలుండి వృద్దాప్యంలో ఇలా ఒంటరిగా కన్న వారికి దూరంగా వారు పడే మనోవేదన వర్ణణాతీతం.
అవసరానికే అన్య భాష.! అన్నిటికీ అమ్మ భాషే.!!
అనే నినాదం అందిచారు మన పెద్దలు. ఎందుకంటే ఎక్కడ ప్రపంచీకరణ ముసుగులో పడిపోయి రాబోవుతరం దారితప్పుతదేమోననే అనుమానంతో.. కానీ ఆ అనుమానాన్నే నిజం చేస్తున్నామా అనే సంశయం కలుగుతోంది నేటి పరిస్థితులు చూస్తుంటే. నేడు మన కుటుంబ వ్యవస్త సర్వనాశనం అవుతుందనడానికి ఈ మధ్య వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలే ఉదాహరణ.
ప్రపంచ యుద్దాల్లో ఎన్నో దేశాలు నామ రూపాలు లేకుండా చరిత్రలో కలిసిపోయాయి. కొన్ని దేశాలు చిన్నాభిన్నమయ్యాయి ఒక్క భారతం తప్ప. కారణం ఇక్కడి కుటుంబ వ్యవస్థే. సనాతన భారతదేశం నేటికీ శాంతి సందేశ దేశంగానే కొనసాగుతోంది. పునాదులు పెకలించలేని ఖండ ఖండాలుగా అనంత విశ్వపు అడుగులోతు వ్యాపించిన వేర్లలా ఇంకా ప్రజ్వరిల్లుతోందంటే కేవలం మన కుటుంబ వ్యవస్తే మూలం ఆధారం అన్నది అక్షర సత్యం.
మనం కుటుంబ వ్యవస్థని ఎంతగా ఆరాదిస్తామంటే ఏకంగ “వసుదైక కుటుంబం” అంటాము. ప్రపంచ మనుష్య జాతిని కలుపేసుకుంటాం మన కుటుంబంలో, అంతటి ప్రేమా కరుణామయులు భారతీయులంటే. మరి అలాంటి జాతికి ఇప్పుడేమైంది..? ఎందుకు ఇలా తయారైంది..? ఎక్కడ మలినమైంది..? కుటుంబ బాంధావ్యాలన్నీ ఆర్థిక బంధాలుగ ఎందుకు మిగిలిపోతున్నాయి..? ధన సంపాదనే జీవిత లక్ష్యంగా యువత ఎందుకు పరుగెడుతుంది..?
ఈ విషయమై కొందరు చరిత్రకారులు చెప్తున్న మాట.. అధిక ధనం లేకుంటే మనిషి విలాసానికి దూరమవ్వొచ్చు కానీ వ్యక్తిత్వం కోల్పోతే జాతి మొత్తం నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు. తల్లీ తండ్రీ గురువూ తోడబుట్టినోల్లూ బంధువులు స్నేహితులు భార్య పిల్లలు అంతా ఆర్థిక బంధాలుగానే మిగిలిన నాడు.. మనిషన్నవాడు కేవలం నడుస్తున్న యంత్రంగా మిగిలిపోతాడనడంలో సందేహమే లేదు.
ఇంత చెప్పినా ఆఖరికి గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. నేడు నీ తల్లిదండ్రులను వృద్దాశ్రమంలో వేసి చేతులు దులుపుకున్నా.. ఆ తర్వాత ఆ స్థానం నీదే అనే విషయాన్ని మరవద్దు. ఒక్క రోజుకే ఫరిమితమయ్యే మదర్స్ డే, ఫాదర్స్ డే లతో పోయేది కాదు పేగుబంధం అంటే. తరతరాల ఖర్మ అనుబంధాలతో కూడినది.
చిన్నపుడు నడవడం రాక తండ్రి భుజాలపై ఎక్కిన కొడుకుకు, ముసలివాడైన తండ్రిని తన భుజాలపై ఎక్కించుకోవడం ప్రతి కొడుకు, ప్రతి కూతురి బాద్యత.
నీకు ఆకలై ఏడిస్తే నడిబజారైనా సరే ఏమాత్రం ఆలోచించక రొమ్ము నోట్లో పెట్టి పాలు తాగించిన తల్లికి నోరు తెరిచి ఆకలేస్తోంది అని అడిగే పరిస్థితి తీసుకు రావద్దు.
అదే తల్లిదండ్రులు నిన్ను భారం అనుకుంటే.. నీ బతుకు ఏనాడో మట్టిలో కలిసిపోయేదని మరవద్దు. తల్లిదండ్రులంటే భారం కాదు బంధమని గుర్తించు. ఏ దేశమేగినా ఎందుకాలిడిన పొగడరా నీ జాతి భూమి భారతిని. నిన్ను కన్న తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన భూమిని ప్రేమించిన నాడు మళ్లీ భూమి భారతికి నిజమైన అందం వచ్చినట్టే. అనాథశ్రామాలు లేని భారత దేశం కనిపించిన నాడు ఏ దేశం కూడా భారతన్ని ఎదురించి నిలిచి గెలవదు. నిలవదు.
కొత్తపల్లి జయశంకరుడు.. తెలంగాణ ఉద్యమాన్ని యువత రక్తంలోకి అత్యంత వేగంగా ప్రవహింపజేసిన మహోద్యమం చరితుడు. సారు చెప్పిన మాటలు సారు వేసిన తోవ ఇ యాల తెలంగాణ లోకాన్ని వెలిగిస్తోంది. ఈ క్షణం సారుంటే ఎంత ముద్దుగుండో.. తెలంగాణ సిద్దించక ముందే ...
ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే నిలదీయాలని లంచమడిగితే ఫిర్యాదు చేయాలని అవసరమైతే నాక్కూడా ఫోన్ చేయొచ్చంటూ అప్పుడు వారి తాట తీస్తానంటూ గతంలో ఓసారి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా చెప్పిన మాటలివి అంతే కాదు ఆయన తన ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ ...
అమెజాన్ మాటికి మాటికి బరి తెగిస్తూనే ఉంది. ఆ మద్య గణేషుడి బొమ్మను చెప్పులపై ముద్రించి.. ఆ తరువాత భారత జాతీ గౌరవాన్ని మంటగలిపేలా డోర్ మ్యాట్ల పై జాతీయ జెండాను అచ్చు వేసి అమ్మకానికి పెట్టింది. ఇలా రోజు రోజుకు ...
బెంగళూర్ లో CAA కి వ్యతిరేకంగ ఎంఐఎం పార్టీ నిర్వహించిన సభలో అసదుద్దీన్ తో వేదిక పంచుకున్న అమూల్య లియోనియో అనే యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ హల్ చల్ చేయడం వెంటనే బెంగళూర్ పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని ...
బెంగళూరులో దారుణం జరిగింది. సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు గురయ్యారు. స్థానిక రాజరాజేశ్వరి నగర్ లోని తన సొంత ఇంట్లోనే ఆమె హత్యకు గురైరయ్యారు. ఈ రోజు సాయంత్రం ఆమె నివాసానికి ఓ గుర్తుతెలియని వ్యక్తి వెళ్లి తలుపు ...
తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. రోజు కు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది బాధితులు మరణిస్తున్నారు అనే లెక్కలు వేసుకునే పరిస్తితి కూడా దాటి ...
నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ కాగజ్ నగర్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్ మహిళా పోలీస్ అధికారి అనిత పై జెడ్పీ వైస్ చైర్మన్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు క్రిష్ణ జరిపిన దాడి విషయం యావత్ దేశం వ్యాప్తంగా సంచలనం ...
ఓ వైపు రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతుండగా మరో వైపు తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లో మృత్యు దేవత విలయ తాండవం చేసింది.ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసి సొలసి ...
నారదుడు విచారంగా ఉన్నాడు.. అతడి మిత్రుడైన తుంబురుడు ఏం నారధ త్రిలోఖ సంచారివి నువ్వు విచారంగా ఉండటం ఏంటి అని అడిగాడు. ఏం చెప్పను తుంబురా... దేవుళ్లకు, రాక్షసులకు ఏ సమస్య ఉన్న నా సలహా తీసుకుంటారు. అలాంటిది నాకే సమస్య ...
ఈ సృష్టిలో అంతు చిక్కని రహస్యాలు చాలా ఉన్నై.. అందులో మహిమాన్విత హిందూ పురాతన ఆలయాలు ప్రంపంచంలో నేటికీ చాలా ఉన్నై.. మరి నేటి ఆధునిక సాంకేతిక విప్లవం సాధించిన మరమనిషి భవిష్యత్తులో ఆ రహస్యాలు ఛేదించగలడా అంటే.. అది కూడా ...
తెలుగు లో బిగ్ బాస్ మొదటి సిరీస్ హంగామ ముగిసింది, జూనియర్ ఎన్టీఆర్ చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.. మొత్తానికి గ్రాండ్ సక్సెస్ కొట్చిందీ బుల్లితెర షో.. ఎవరు గెలుస్తారో ఆఖరిదాక సస్పెన్స్ కొనసాగినా ఫైనల్లో నటుడు శివ ...
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది జస్టిస్ ఆవుల సాంబశివరావు పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. తెలుగు విశ్వవిద్యాలయం ఈ పురస్కారాన్ని ఈనెల 24న ప్రదానం చేయనుంది. ఈ ఏడాది జస్టిస్ ఆవుల ...
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రావణ్ గురించి విస్తుపోయ నిజాలు బయటపడుతున్నాయి. కేసులో తొలి నుంచి రాజీవ్ పేరు ప్రధానంగా వినిపించినా.. ఏ1గా శ్రావణ్ ను చేర్చడం పట్ల పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
ప్రభాకర్ మృతికి ...
సార్ వెళ్లిపోయి అప్పుడే రెండెళ్లయింది. నిన్న మొన్న మనల్ని విడిచి వెళ్లినట్టు తోస్తోంది. అయినా ఆయనెక్కడికెళ్లాడు.. ప్రతి నిమిషం ప్రతి క్షణం మన కణకణం రగిలిస్తూ మనలో కొత్త భావాలను పుట్టిస్తూ మనసే మతం మనమే కులం మన బాటే ధర్మం ...
నేటి సమాజం లో యువత గురించి చెప్పాలంటే.. సమయం దొరికితే చాలు ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తుంది. అయితే ఇది తప్పు నేటి యువతలోనూ సమాజాన్ని ప్రేమించే గుణం, దైవ భక్తి అంతకు మించి దేశ భక్తి ఉందని చాటి ...
గత నెలలో హైద్రాబాద్ బోరబండ లో హనుమాన్ ఆలయం కూల్చివేత ఘటనలో స్థానిక TRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పోలీసులను అడ్డం పెట్టుకుని భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు అని ఎమ్మెల్యే అనుచరులు ఆలయాన్ని కూల్చి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాన్ని ...
మందు బాబులం మేము మందుబాబులం మందుకొడితె మాకు మేమే మహరాజులం అని తరువాత పాడుకునేరు కానీ ఫస్ట్ అయితే మందు తాగే ముందు.. ముందు వెనుక ఆలోచించి తాగండి లేదంటే మత్తులోనే మాయలోకం నుండి అటు నుండి అటే టికెట్ లేకుండా ...
మృగశిర కార్తె ప్రవేశాన్ని వర్షారంభానికి సూచనగా భావిస్తారు. రోహిణికార్తె లో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగశిర కార్తె ను రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ...
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు ఘనంగ వేడుకలు నిర్వహిస్తున్నారు. పలు సేవాకార్యక్రమాలతో పాటు పలు జిల్లా కేంద్రాలలోనూ స్వీట్లు పంచుకుని వేడుకలు నిర్వహించుకున్నారు. తూటుపల్లి రవి ...
దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ముఖ్య విషయాల్లో లవ్ జిహాద్ ఒకటి. ఈ లవ్ జిహాద్ పక్కా ప్రణాళిక తో హిందూ యువతులను ట్రాప్ చేసి వారిని శారీరకంగా మానసికంగా గాయం చేసి ఆ తర్వాత సదరు యువతి నీ అటు ...
వయస్సు 25 సంవత్సరాలే. కానీ, అతనికి అప్పుడే జీవితంపై విరక్తి ఏర్పడింది. దీంతో జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ, సోదడిని వారి యోగక్షేమాలు చూసుకోవాలని సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అంబర్పేట పోలీస్ ...
విద్యా.. కాసుల కుంభ వృష్డిని కురిపించే వ్యాపారం. అందుకు సివిల్స్ టాప్ త్రీ ర్యాంకర్ గోపాల కృష్ణ ఉదంతమే ఉదాహరణ. అహర్నిషలు కష్టపడి స్వయం శక్తిని మాత్రమే నమ్ముకుని ఎలాంటి కోచింగ్ లు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన జ్ఞానంతోనే సివిల్స్ ...
అవును అవినీతిలో మనమే టాప్.. ఎందులో టాప్ లో లేకపోయిన ఇందులో మాత్రం భారత్ ను అగ్ర స్థానం లో మనమే స్థానం దక్కేలా చేస్తాం. అడిగినంత లంచం ఇచ్చి మరీ టాప్ ర్యాంక్ దక్కించుకుంటాం. ఇది మన దౌర్భాగ్యం. ఆసియా ...
తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెబోయిన అంజి యాదవ్ జన్మధినం పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమాల అడ్డ ఉస్మానియా యూనివర్శిటీ లో బీసీ విద్యార్థి సంఘం తరుపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కాగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ...